రైతులకు వ్యవసాయ పనిముట్లపై రాయితీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కంది మండలం చిదురుప్ప గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన హరీశ్ రావు…టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగు, తాగు నీటి కష్టాలు లేవని చెప్పారు.
సంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని …. కూరగాయలు, పండ్ల తోటల సాగు లాభదాయకం అని వెల్లడించారు. 20 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పండించాల్సిన అవసరం ఉందన్నారు.
సాగుకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో పవర్ బిల్లులను ముక్కుపిండి వసూలు చేశారు.. సరిపడా విద్యుత్ ఇవ్వలేదని గుర్తు చేశారు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే తమ ప్రభుత్వం రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నామని…తెలంగాణలో ఉంది రైతు ప్రభుత్వం అని వెల్లడించారు.