భూ భారతి కాదు.. భూ హారతి అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో 22A బాధితులతో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్..భూ భారతి అక్రమాలపై ఆధారాలను బయటపెట్టారు. గజ్వేల్ పట్టణంలో రాధ అనే వృద్ధురాలికి చెందిన భూమిని భూ భారతి ద్వారా కబ్జా చేశారు…బాధితురాలికి తెలియకుండానే ఆమె భూమిని వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు…కేవలం 10 రోజుల్లోనే ఆమె భూమిని ఆమెకు కాకుండా చేశారు…ధరణిని తీసేసి భూ భారతి తీసుకురావడానికి ముఖ్య కారణం ఇదే అన్నారు.
పొంగులేటి వ్యాఖ్యలపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు.11-09-2025 నాడు కొత్త నిషేధిత జాబితా లిస్ట్ పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేశారు…20-11-2025 నాడు జనగామ కలెక్టర్ నిషేధిత జాబితా లిస్ట్ తయారు చేసి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు పంపారు..ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కలెక్టర్ పంపిన భూముల జాబితాను 22-A నిషేధిత జాబితాలో పెడుతూ నోటిఫికేషన్ ఇచ్చింది.. ఇలా అన్ని జిల్లాల్లో పెట్టారు అన్నారు.
సిర్పూర్ – కాగజ్ నగర్ ప్రాంతంలో 30 వేల ఎకరాలు అక్టోబర్ 2025లో నిషేధిత జాబితాలో పెట్టారు… మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టారు… పొంగులేటి ఏమో ఒక్క సెంట్ భూమి కూడా మా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదు అని అన్నాడు…33 జిల్లాల కలెక్టర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని లిస్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపారు… అన్ని జిల్లాల కలెక్టర్ల జీవోల ఆధారాలతో చూపించాం.. చీము నెత్తురు ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలి అన్నారు.
కొత్తగా మేము 22A కింద ఒక్క సెంటు భూమి కూడా పెట్టలేదని పొంగులేటి చెబుతున్నాడు ..ఇంతకంటే పెద్ద అబద్ధం ఏదైనా ఉంటుందా?, నీకు ఏమైనా బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి ..ఇవాళ రాష్ట్రమంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిషేదిత జాబితాలో పెట్టారని చెబుతుంటే.. మీరు ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెబుతారు అని ప్రశ్నించారు.
Also Read:భారత్‌లో ‘బ్రిక్స్’ సందడి..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామంలో అనుముల తిరుపతిరెడ్డి భూ కుంభకోణాన్ని బయటపెట్టారు హరీష్ రావు.గతంలో అనుముల తిరుపతిరెడ్డికి వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది… రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 5 నెలల్లోనే అనుముల తిరుపతిరెడ్డికి సానుకూలంగా భూమి డాక్యుమెంట్లు మార్చేశారు..ఆ భూమిలో ప్రజలందరూ బిల్డింగ్‌లు కట్టుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అది వ్యవసాయ భూమి అని అనుముల తిరుపతిరెడ్డి పేరిట డాక్యుమెంట్లు సిద్ధం చేసింది అన్నారు.

