కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ప్రభుత్వం డిఫెన్స్ చాలా స్పష్టంగా బయటపడింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాత్రి 9.30 కు ముఖ్యమంత్రి చిట్ చాట్ మొదటిసారి చూశాను ..కేసీఆర్, బీఆర్ఎస్ కు సీఎం, మంత్రులు ఎంత భయపడుతున్నారో… నిరాశలో ఉన్నారో అర్థం అవుతోంది..గాలి మేలు అంటున్నారు… అందాల పోటీలు, ఫుట్ బాల్ పోటీలు ఏమంటారు?..సీఎం కు వాస్తు భయం పట్టుకొంది… గేట్లు, మరమ్మత్తులు చేసి కూడా సచివాలయం పోవడం లేదు అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో మీటింగ్ పెట్టారు,సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూసి భయపడి సహకార సంఘాల ఎన్నికల్లో నామినేట్ చేయడానికి సిద్ధమయ్యారు,రైతులకు మేలు చేసి ఉంటే ఎన్నికలు పెట్టవచ్చు కదా…రైతులు ఆగ్రహంగా ఉన్నారని, తీర్గబడతారని అర్థం అయినట్లుంది..దమ్ముంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి..ఎన్నికలు పెట్టడం లేదంటేనే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లు అన్నారు.
ఓయూ కు పోలీసుల పహరాతో ఎందుకు వెళ్లినట్లు…అసెంబ్లీలో నీటిపారుదలపై పీపీటీ పెడితే స్వాగతిస్తాం, మాకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలి,అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలి…ప్రధాన ప్రతిపక్షానికి మిగతా పార్టీల కంటే తక్కువ సమయం ఇస్తున్నారు?,వాస్తవాలు బయటకు వస్తాయని భయపడి బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్నారు..మాకు పీపీటీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ వైఫల్యాలు బయటపెడతాం అన్నారు. కాంగ్రెస్ అంటేనే ద్రోహం, నాడు నేడు ఎపుడైనా ద్రోహమే … పాలమూరు – రంగారెడ్డికి 7000 కోట్లు ఇచ్చామని అన్నారు, ఏడు గజాలు అయినా ఇచ్చారా?… 20 శాతం కమిషన్ కోసం బిల్లులు ఇచ్చారు..భట్టి, ఉత్తమ్ కమిషన్ పంచుకున్నారు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ ప్రభుత్వంగా మారింది…అప్పులు తేవడానికి కమిషన్లు ఇస్తున్నారు, బిల్లులు ఇచ్చి కమిషన్లు కొట్టారు..బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి మరీ అప్పులు తెస్తున్నారు, అసెంబ్లీలో ఈ అంశం ప్రభుత్వమే చెప్పింది,జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేస్తే మరో 20 వేల కోట్లు అప్పు తేవచ్చని బ్రోకర్ చెప్పారట,బ్రోకర్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, బ్రోకర్ల పాలన నడుస్తోంది,అప్పుల కోసం బాంబే బ్రోకర్ చెప్పినట్లు కొత్త డిస్కం కూడా పెట్టారు..బాంబే బ్రోకర్ చెబితే రేవంత్ రెడ్డి ఆచరిస్తున్నారు అన్నారు.
బ్రోకర్లను పెట్టి భూములు కుదువపెట్టి అధిక వడ్డీకి అప్పులు తెస్తున్నారు..బ్రోకర్, రేవంత్ రెడ్డికి లాభం కానీ… రాష్ట్రానికి మాత్రం నష్టం,కృష్ణా జలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ వాడినట్లు సీఎం, ఉత్తమ్ చెప్తున్నారు,వచ్చిన నీటిలో బీఆర్ఎస్ వాడిన శాతం కంటే… కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువగా కేవలం 28.9 శాతం మాత్రమే వాడుకొంది ..కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే చాలా తక్కువ నీరు వాడారు..రేవంత్ రెడ్డి ప్రతిసారి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు..కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు,కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు సీఎం, మంత్రులు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదు,ఏదో బురదజల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు..ఫార్ములా – ఈ కేసులో ఏం లేకున్నా కేటీఆర్ పై కక్ష గట్టారు అన్నారు.
డిఫెన్స్ లో పడింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసు ఇస్తారట…అసెంబ్లీ సమావేశాలు ముగిసే మూడో తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట,సిట్ లు ప్రహసనం అయ్యాయి, కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు,కొందరు పోలీసులు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు,ఏపీలో ఏం అయ్యిందో చూశారు కదా..ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మీకు అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం,
రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారు, జాగ్రత్త…కేసులు మాకు కొత్త కాదు…రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు క్షమించాలని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని కోరితే నాపై కేసు పెట్టారు అన్నారు.
హామీలు ఎగబెట్టారని అంటే కూడా నాపై కేసు పెట్టారు…ఖమ్మంలో మా కార్లపై రాళ్ల దాడి చేశారు, కేసు పెడితే ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు,సిద్దిపేటలో మా ఇంటిపై దాడి చేయించారు, ఇప్పటికీ కేసు కాలేదు…నీటిపారుదల పై వాస్తవాలు చెబితే ఉదయమే లీక్ ఇచ్చారు…ఎన్ని లీకులు ఇచ్చినా, కేసులు పెట్టినా వదిలిపెట్టం…
కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసే వరకు, రాష్ట్రాన్ని కాపాడే వరకు ఊరుకోబొం …45 టీఎంసీలకు లేఖ రాసినట్లు ఉత్తమ్ ఒప్పుకున్నారు…అరెస్టులు, తాటాకు చప్పుళ్లకు త్యాగాల చరిత్ర ఉంది, అరెస్ట్ లకు భయపడేది లేదు..అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం అన్నారు.
పోలీసు అధికారులు చట్ట ప్రకారం పనిచేయాలి …అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్ లో రాస్తున్నాం ,అక్రమాలు, అరాచకాలు, సెటిల్మెంట్లు అన్నీ నమోదు చేస్తున్నాం…బీఆర్ఎస్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న వారిని గమనిస్తున్నాం,అతిగా వ్యవహరించే పోలీసు అధికారులు రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా, కేంద్ర సర్వీసులకు వెళ్ళినా పట్టుకొస్తాం,ఖాకీ బుక్ ఉందని డీజీపీ చెప్తున్నారు… సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ లో ఏమైంది?..ఓటు వేయలేదని ఎస్సీ కుటుంబాల ఇండ్లను పోలీసులు దగ్గర ఉండి కూల్చివేయిస్తారా? ఫిర్యాదు చేస్తే కేసు పెట్టకుండా భయపెడతారా?,కాన్ స్టేబుల్ల కష్టాలు చూడండి, వాళ్లు తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి
,కానిస్టేబుల్ల సమస్యలు డీజీపీ శివధర్ రెడ్డి పట్టించుకోవడం లేదు ..రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ పై ఉన్న ప్రేమ దళిత కుటుంబాలపై దాడి చేస్తే లేదా?,మాకు నోటీసులు ఇవ్వడమేనా డీజీపీ పని? చెప్పాలన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక ఉందని కొండాపూర్ బెటాలియన్ పోలీసులకు మాత్రమే సరెండర్ లీవ్ లు విడుదల చేశారు… రాష్ట్రం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు…
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో… శివధర్ రెడ్డి ఖాకీ బుక్ లో నిజాయతీ అంత ఉంది..హైదరాబాద్ నడిబొడ్డున ఫుడ్ పాయిజన్ అయితే నేను వెళ్లాను, నా తరువాత మంత్రి అజారుద్దీన్ వెళ్లి అధికారులను సస్పెండ్ చేశారు,ఎక్కడా ఫుడ్ పాయిజన్ కాలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు..ఫుడ్ పాయిజన్ కాకపోతే మంత్రి ఎందుకు వెళ్లారు? వార్డెన్ ను ఎందుకు సస్పెండ్ చేశారు?…పాలమూరు – రంగారెడ్డికి 45 టీఎంసీలకు డీపీఆర్ అప్రైజల్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు…
బీఆర్ఎస్ హయాంలో డీపీఆర్ వెనక్కు వస్తే అనుమతులు ఎలా వస్తాయి?,90 టీఎంసీల కోసం 2023 లోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు సాధించాం,కాంగ్రెస్ హయాంలో డీపీఆర్ వెనక్కు వచ్చి ఏడాది అయింది, ఇప్పటి వరకు ఉలుకు లేదు… పలుకు లేదు,పాలమూరు – రంగారెడ్డి కాల్వలకు టెండర్లు పిలిస్తే… కాంగ్రెస్ వచ్చిన తర్వాత రద్దు చేశారు,కాంగ్రెస్ నేతలు వెళ్లి స్టే తెచ్చినందుకే తాగునీటి పేరిట సొరంగాలు, పంపుల పనులు చేశాం,ఈఏసీ అనుమతి వచ్చిన తర్వాత కాల్వల పనుల కోసం టెండర్లు పిలిచాం…మేము ప్రజెంటేషన్ ఇచ్చినపుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదని బయటకు వెళ్ళిపోయారు,పాలమూరు పనులపై అసెంబ్లీ, ప్రెస్ క్లబ్, టీవీ ఛానళ్లు ఎక్కడైనా ఉత్తమ్ తో చర్చకు సిద్ధం అన్నారు.

