Harishrao:విశ్వసనీయతే ముఖ్యం..పదవులు కాదు

27
- Advertisement -

తనకు విశ్వసనీయతే ముఖ్యం పదవులు కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తనను ఏక్‌నాథ్‌ షిండే అనేవారిని చెప్పుతో కొట్టాలన్నారు. 24 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్నానని, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తి హరీశ్ కాదన్నారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతగాక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేతగాక, అడ్మినిస్ట్రేషన్ రాక, కనీసం కేసీఆర్ ఉండగా పెట్టిన పథకాలను కూడా కొనసాగించలేకపోతున్నారు.ఉన్న పథకాలను కూడా నడిపించలేని అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.

ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్..సుపారీ తీసుకునే అలవాటు రేవంత్ రెడ్డికే ఉంది. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా చేశాడన్నారు. ఇంతకంటే ప్రూఫ్ ఉంటుందా? ఆలోచించాలన్నారు.

ఆర్టీసీ కోసం 3000 కోట్ల రూపాయలు మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్లో పెట్టాం…గత బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ నాటికే 1500 కోట్ల రూపాయలు ఆర్టిసీకి అందించింది. కాంగ్రెస్ వచ్చాక మేము బడ్జెట్లో పెట్టినవే ఇస్తున్నారు తప్ప ఫ్రీ టికెట్లకి సంబంధించి అదనంగా ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలే.అందుకే ఇవాళ ఆర్టీసీ నష్టాల్లోకి పోతుందన్నారు.

మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎన్నో పథకాలను బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. అందులో రైతుబంధు, రైతుభీమా లాంటివి రైతులకు అవసరం అని అమలు చేశాం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద లై డిటెక్టర్ టెస్టుకి రెడీ అని కేటీఆర్ ఎప్పుడో చెప్పాడు, రేవంత్ రెడ్డిని రమ్మనండి చూద్దాం…అలాగే ఆనాడు కాంగ్రెస్ మంత్రులే ఆరోపించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద 2001 నుంచి ఇప్పటి వరకూ ఇండిపెండెంట్ సంస్థతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -