మాజీ మంత్రి హరీష్ హౌస్ అరెస్ట్

1
- Advertisement -

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు గురువారం ఉదయం నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.

వరంగల్‌లో ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా వరంగల్ పర్యటనకు సిద్ధమైన హరీష్ రావును నిరోధించేందుకు ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ హౌస్ అరెస్ట్‌పై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకింత భయం రేవంత్?” అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాల్సిందేనని, విద్యార్థుల వైపు నిలబడకుండా తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు, అరెస్టులకు భయపడేది లేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Also read:బీజేపీపై విరుచుకుపడ్డ అఖిలేష్

- Advertisement -