నీళ్లు ఇవ్వకపోతే మల్లన్న సాగర్‌ని ముట్టడిస్తాం:హరీష్

32
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్‌, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని సిద్దిపేట కలెక్టర్‌కు హరీశ్‌ రావు వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కేసీఆర్‌ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని…ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు.

మల్లన్నసాగర్‌లో నీళ్లున్నా ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. కూడవెళ్లి వాగుకు 24 గంటల్లోగా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వేలాది మంది రైతులతో మల్లన్న సాగర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇచ్చి, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు ఇచ్చి భట్టి విక్రమార్క తన చిత్తశుద్ధిని చూపించాలని డిమాండ్ చేశారు.

Also Read:ఏపీలో ‘పెన్షన్ గోల’..!

- Advertisement -