కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీచేసిన హరీష్‌..

425
harish
- Advertisement -

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పర్యటించారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కల్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు 116 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. పెండింగ్‌లో ఉన్న 850 పెండింగ్ చెక్కులను నాలుగైదు రోజుల్లో లబ్ధిదారులకు అందజేస్తాం అన్నారు. రెండో పంట కోసం పల్లి, సెనగా విత్తనాలను 35 శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నాం అన్నారు.

అన్ని చోట్లా యధావిధిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం… వడ్ల కొరకు 1835 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నాం అన్నారు. అవసరమైతే మొక్కజొన్న కొనుగోళ్ళను కూడా చేస్తాం… పత్తి మద్దతు ధర 5550 రూపాయలు ఇస్తాం రైతులు దీనిని వినియోగించుకోవాలన్నారు. ఇది రైతు రాజ్యం రైతే ముఖ్యమంత్రి… ఒక గజ్వెల్ నియోజకవర్గంలో 50 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ లు ఉన్నాయి…గతంలో 3 వేల స్థాయి గౌడోన్ లు ఉండేవన్నారు.

- Advertisement -