Harishrao:గ్రూప్స్ అభ్యర్థుల అరెస్ట్ అక్రమం

5
- Advertisement -

గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం…విద్యార్థులు నివసించే అశోక్ నగర్ లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా మీ ప్రజా పాలన? అన్నారు. ఎన్నికల సమయంలో మీ నాయకుడు @RahulGandhi గారు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? హామీలు ఇచ్చి విద్యార్థులను మభ్యపెట్టిన రోజులు గుర్తులేవా? అన్నారు.

పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల మీరు చూపిన కపట ప్రేమ అసలు రంగు బయట పడింది. రేవంత్ రెడ్డి..విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న మీ దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అన్నారు హరీశ్‌ రావు.

Also Read:Bigg Boss 8 Telugu: ఇంటి సభ్యులకు కొత్త టాస్క్

- Advertisement -