మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ హేయమైన చర్య:హరీశ్‌

2
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు ఛలో హైదరాబాద్ కు పిలుపునిస్తే, వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య… దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు.

తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో మాట్లాడిన హరీశ్‌…ఇలా ఇప్పటికే పలు మార్లు చేశారు. సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేసామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అడిగితే ఈ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారు అన్నారు.

ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకం అన్నారు. మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారు…బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా చెప్పాలన్నారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదు అన్నారు.

నాలుగైదు సారు హైదరాబాద్ కు వచ్చి మోర పెట్టుకున్నారు..ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలవండి, వెంటనే వారి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలన్నారు. లక్షా 50వేల కోట్లతో మూసి బాగు చేస్తా అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావు అన్నారు. సర్పంచుల అరెస్టులు పరిష్కారం కాదు, సర్పంచుల ఫోన్లు గుంజుకొని టెర్రరిస్టుల లెక్క పోలీసు స్టేషన్లకు తీసుకుపోతున్నారు అన్నారు.

మేము వచ్చి వారి బాధలు వినాలని వస్తే వారిని వెంటనే డీసీఎంలలో ఎక్కించి తరలిస్తున్నరు…పాపం భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశా అన్నారు.వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:KTR :గ్యారెంటీలపై రాహూల్‌ని నిలదీసిన కేటీఆర్‌

- Advertisement -