హైదరాబాద్‌లో సముద్రమా?..నవ్వుకుంటున్నారు!

4
- Advertisement -

పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. తల్లిదండ్రులు టీవీలు బంద్ పెడ్తున్నారు అన్నారు హరీశ్‌ రావు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు… రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గెబెల్స్ కూడా సిగ్గు పడ్తారు..రేవంత్ రెడ్డి మాటలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. హైద్రాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి అన్నారు.

రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు…దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు…తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు, రేవంత్ కు నక్కకూ.. నాగలోకాని ఉన్న తేడా ఉంది అని…సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలి అన్నాడు. ర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్ ఉన్నాడు…ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్. సీఎం అయ్యేది కేసీఆర్ అని తేల్చిచెప్పారు.

దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది…కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? చెప్పాలన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం చేశాడని..ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు అన్నారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా నింపలేడు అని ఎద్దేవా చేశారు.

Also Read:బాబు వస్తే కరువు వస్తుంది: వైసీపీ ఎంపీ

- Advertisement -