Harishrao:రేవంత్‌కు సవాల్ విసిరిన హరీష్‌

18
- Advertisement -

ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాట్లాడిన హరీష్‌..పంద్రాగ‌స్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణ‌మాఫీ చేయ‌క‌పోతే రాజీనామా చేస్తావా..? అని స‌వాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2500 సహాయం, కళ్యాణాలక్ష్మి కింద‌ తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను ఓడించాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు.

2014, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదు.. మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి న‌ర్సింహులు, హనుమంతరావులే మా సీఎం కలవట్లేదు అని అంటున్నారు. మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Also Read:వేసవిలో రాగిజావా.. ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -