Revanth Reddy:ఆదిలాబాద్‌కు వరాల జల్లు

13
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తున్నామని …అక్కడ ముంపునకు గురయ్యే 1,800 ఎకరాలకు సాయం అందిస్తామని చెప్పారు.

ఆదిలాబాద్‌లో ఓ వర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను మోదీ, కేసీఆర్ కలిసి మూసేశారని తెలిపారు. ఆదిలాబాద్ సీసీఐని కూడా తెరిపిస్తామని అన్నారు.ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే పథకాలన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మహిళకు ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. మహిళలు 35 కోట్ల ట్రిప్పులు ఉచితంగా ప్రయాణించడం గర్వకారణమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేసీఆర్ తరుచూ చెబుతున్నారని తెలిపారు. తాము 40 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ ఇచ్చామని చెప్పారు.

Also Read:వేసవిలో రాగిజావా.. ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -