సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్

8
- Advertisement -

సీఎం రేంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. బీఆర్‌ఎస్‌ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని.. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వంద సీట్లతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అమరవీరులకు, ప్రోఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి గారికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 12 వేల కోట్ల ప్రాజెక్టులను కేవలం నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ మిస్‌ వరల్డ్‌ ఇంగ్లండ్‌ కంటెస్టెంట్‌ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనే వార్తలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టినందుకు పోలీస్‌ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్షలు నిర్వహిస్తున్నావా అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read:నెయ్యి ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

- Advertisement -