పొంగులేటిపై చర్యలేవి?:హరీష్

2
- Advertisement -

ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కొండా సురేఖ నిన్ను తిట్టిందని తీసేశావు.. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు… నీకు ఏమైనా దాంట్లో 50/50 వాటా ఉందా రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు.

అరేయ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుక తరాజులో వేసి నువ్వు అవతల దిక్కు కూర్చున్నా సరిపోవురా బిడ్డా అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. వాడు కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, నువ్వు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు… నీ ఏడుపు ఏదో నువ్వు ఏడువో, నీ పార్టీలో నిన్ను తిట్టే వాళ్ళ సంగతి చూస్కో అన్నారు. కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడితే మర్యాదగా ఉండదు, నీకు ఇంకా రెండేండ్లే టైం ఉంది… నిన్ను జనం మనిషికో చెప్పు దెబ్బ కొడతారు అన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి, సిగ్గులేకుండా టోల్‌ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడు అని దుయ్యబట్టారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే, బాధితుల నంబర్లు తీసుకుని, ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్‌గాళ్లు ఫోన్ చేస్తారు… నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే, నీ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని చెప్తారు… ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ద్వారా మన భూములను వేరే వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు అని ఆరోపించారు.

Also Read:ఏకాదశి విశిష్టత..పూజా విధానం

- Advertisement -