సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మహిళలకు చీరెలు అందించారు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు… సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83 వేల మంది మహిళలు ఉంటే లక్ష 99 వేల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు అన్నారు.
ఒక్క ఏడాదికి మాత్రమే చీరే ఇచ్చి సారే పెట్టిన అంటున్నారు.. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ళంత ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రేవంత్ రెడ్డి ఇస్తానాన్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 సంగతి ఏందీ.. రెండేళ్లలో 60వేలు ఇచ్చి సారే పెట్టాలి..🔹 రెండు చీరలు ఇస్తామని ఒకటే ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటేయ్యాలి.. పట్టణ ప్రాంతాల్లో చీరెలు లేవు… వడ్డీలేని రుణాలు లేవు… పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవు అన్నారు.
మహిళ సంఘాలు 25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే 5వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగబడుతుంది మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి.. గతంలో స్త్రీ నిది కింద రుణాలు ఇచ్చాం.. ఇప్పుడు స్త్రీ నిది వడ్డీ ఋణం ఇవ్వడం లేదు.. స్త్రీ నిధికి కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.. మీ పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడుతా.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్థామని రాష్ట్రంలో ఒక్క మహిళా సంఘాలకి ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు.. ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళ సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి రెండు ఏళ్ళు అయిన ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడ కూడా పెట్టలేదు.. కేసీఆర్ పండుగ పండుగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంకేమ పథకాలు ఇస్తున్నారు… రైతుబందు ఓట్లకు… చీరల పంపిణీ ఓట్లకే .. వడ్డీ లేని రుణాలు ఓట్లకే .. రుణమాఫీ సగం ఇచ్చిండు సగం ఎగొట్టిండు… ఆశ పెట్టడం.. ఆయాస పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం ఈ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి అలవాట గా మారింది అన్నారు.

