నిఖత్ జరీన్‌కు వాకిటి శ్రీహరి అభినందనలు

9
- Advertisement -

తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర బాక్సర్, గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్ మంగళవారం కలిశారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కప్ 2025 (51 కేజీల విభాగం)లో గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణకు, దేశానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంగా నిఖత్, మంత్రి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా, మంత్రి శ్రీహరి నిఖత్‌ను శాలువాతో సన్మానించి, ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిఖత్ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

మంత్రి శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు అన్ని రకాల భరోసా ఇస్తోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Also Read:పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

- Advertisement -