తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది.
మూడు దశల్లో నియామక ప్రక్రియను చేపట్టనుండగా రిజర్వేషన్, రోస్టర్ విధానాలను కచ్చితంగా పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్ సైట్లలో పొందుపరుస్తారు.
1:10 నిష్పత్తిలో(ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున) రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో 20 మార్కులుంటాయి. వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
12 విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 2,817 మంజూరు పోస్టులు ఉన్నాయి. వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు 1,524. ఇందులో 1061 పోస్టులు ఖాళీగా ఉండగా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
Also Read:శ్రీరామ నవమి విశిష్టత

