రేవంత్‌కు బేసిక్ నాలెడ్జ్‌ లేదు:హరీష్

10
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడిన మాటలు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు గత కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండి అని మేము మాట్లాడితే బోడి గుండు కు మోకాలుకు లంకె పెట్టినట్లు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్..అసలు విషయాన్ని పక్కనపెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి బేసిన్ ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడారు అన్నారు.

బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది గాని బేసిన్ల మీద నాలెడ్జ్ లేదు..పిపిటి పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తంకుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు…సీఎం, నీళ్ల మంత్రి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు అన్నారు. దేశం ముందు పరువు పోయే పరిస్థితి. అవగాహన లేకుండా మాట్లాడడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం…రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో మూర్తిభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు అన్నారు.

దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియదు, బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు..రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లు…బనకచర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుండి పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాల రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే అమాయకంగా ముఖ్యమంత్రి అడుగుతారు బనకచర్ల ఏ బీసీల్లో ఉందని అన్నారు.

నీకు ఎంత కమిట్మెంట్ ఉందో నీకు ఎంత సిన్సియార్టీ ఉందో ఆరు నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినావో నిన్న బయటపడ్డది…ఆంధ్ర దోపిడీ అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యి ముఖ్యమంత్రి అంటే, అక్రమ ప్రాజెక్టును ఆపవయ్యా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్దాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి పారించారు అన్నారు.

అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్క తోవ పట్టించారు…. రాజకీయ వేదికగా మార్చకు, బనకచర్ల ఆపాలి అని మా ఇంటి రవిచంద్ర గారు అంటే అబద్ధాలకు వేదికగా మార్చారు.రేవంత్ రెడ్డి కుసంస్కారి. వదులుబోతు. ఉద్యమాల నుంచి మేము వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు…దేవాదుల కూడా గోదావరి బేసిన్ కదా అని కొత్తగా అడుగుతున్నాడు. బనకచర్ల ఏ బేసిన్ లో ఉంది అంటడు. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ ల గురించి తెలుసుకోవడం. అజ్ఞానం బయట పెట్టుకుని రాష్ట్ర ముందు పరువు తీసుకుని నిన్ను నువ్వు. ఆయన సలహాదారుడు ఆదిత్యా దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడు. అది ఉన్నది నంద్యాల జిల్లాల్లో…ముఖ్యమంత్రి అట్లంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడుగా ఉన్నాడు అన్నారు.

750 టీఎంసీల నీళ్ళు రావాలని బ్రిడ్జెస్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించాం…సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్,కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చాయి.అది ఈ కాంగ్రెస్ దరిద్రం వలనే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్‌దే అన్నారు.

న్యాయమైన వాటా కోసం సుప్రీం వెళ్ళారు…763 tmc నీళ్ళు రావాలని విధించాలని లాయర్లకు సూచించారు.పోలవరం ద్వారా మళ్ళించే 80 tmc లో 45 రావాలని కూడా చేర్చారు.దాని ప్రకారం 75% డిపెండబిలిటీ కింద 555 tmc, 65 డిపెండబులిటీ కింద 43 tmc , average కింద 120 tmc, వాటర్ డైవర్షన్ కింద 45 టీఎంసీ అన్ని కలిపి 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలని ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ ఫైల్ చేసింది. మీరు చెబుతున్నది ట్రిబ్యునల్ ను ఎఫెక్ట్ చేయదా? 500 చాలు అని ఎలా అంటావు. మన వాదనకు విలువ ఉంటదా?,బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పాలన్నారు.

Also Read:పెద్ది…దివ్యేందు శర్మ బర్త్ డే స్పెషల్

- Advertisement -