రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు.ఆశా వర్కర్ల ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన హరీష్… రేవంత్ రెడ్డి ఇనుప కంచెలు వేసుకొని భయపడుకుంట ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు పోయిండు అన్నారు.
రేవంత్ రెడ్డి వస్తున్నాడని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేశారు… తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రేవంత్ రెడ్డిని ఉరికిస్తే.. సందుల్లల్ల పడి ఉరికిండు అన్నారు.
జేబులో కత్తెర పెట్టుకొని బీఆర్ఎస్ కట్టినవాటికి రిబ్బన్ కట్ చేసుడు తప్ప నవ్వు చేసింది ఏంది? , నన్ను కోసుకొని తిన్నా ఉద్యోగుల కోసం పైసల్ లేవు అంటావు.. కానీ నీ ఫ్యూచర్ సిటీ కోసం 6 లైన్ రోడ్డులు వేస్తావు.. జీహెచ్ఏంసీలో 10 వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు, ఇరిగేషన్లో 10 వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు, హెచ్ఏండీఏ 10 వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు, జీహెచ్ఏంసీలో 6 వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదపు 50, 60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావు చెప్పాలన్నారు.
మరి పైసల్ లేకపోతే 50, 60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఎలా పిలిచావు రేవంత్ రెడ్డి… ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట ఇచ్చింది… రేవంత్ రెడ్డి మీరు ఏ మాటిచ్చారో ఆ మాట నెరవేర్చండి అని అడుగుతున్నారు. ఇది కొత్త విషయం కాదు.ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా? చెప్పాలన్నారు.
Also Read:తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా..GAMA వేడుకలు

