ప్రతీ వారంలాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ETV Win తన కథా సుధ సిరీస్‌లో మరో షార్ట్ స్టోరీని విడుదల చేసింది. ప్రేమ ఎక్కడ నీ చిరునామా పేరుతో వచ్చిన ఈ చిత్రంలో రామ్‌కీ, సాయితేజ గోన, ఇవాన ప్రధాన పాత్రల్లో నటించారు. సుధీర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె. రాఘవేంద్రరావు నిర్మించారు. ఆగస్ట్ 24, 2025 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.
మార్వెల్ తరఫున “Gen Z కోసం అవెంజర్స్”గా చెప్పబడుతున్న Thunderbolts కొత్త టీమ్, కొత్త విలన్స్, కొత్త సెటప్‌తో వస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమైంది. ఆగస్ట్ 27, 2025న Jio Hotstarలో ఇంగ్లీష్, తెలుగు మరియు మరికొన్ని భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
2007లో అనురాగ్ బసు తెరకెక్కించిన లైఫ్ ఇన్ ఏ… మెట్రోకి ఆత్మీయ సీక్వెల్‌గా వచ్చిన మెట్రో ఇన్ డైనోలో అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, కాన్కణా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి నటించారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో మిశ్రమ సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఆగస్ట్ 29, 2025 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వెర్షన్ రావడం అనుమానాస్పదం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 29, 2025న ప్రీమియర్ అవుతున్న సాంగ్స్ ఆఫ్ ప్యారడైస్ సంగీత నాటకం. దానిష్ రెంజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కాశ్మీర్‌కి చెందిన తొలి మహిళా గాయని రాజ్ బేగం జీవితానికి ప్రేరణగా రూపొందింది. సోనీ రజ్దాన్, సబా ఆజాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు ఆడియో వెర్షన్ వచ్చే అవకాశముంది, కానీ అధికారిక ధృవీకరణ ప్రీమియర్ సమయానికే తెలుస్తుంది.
ప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ ఫ్రాంచైజ్‌లో తాజా చిత్రం కరాటే కిడ్: లెజెండ్స్. జాకీ చాన్, బెన్ వాంగ్, రాల్ఫ్ మాక్కియో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ఈ ఏడాది మేలో థియేటర్లలో విడుదలై మామూలు స్పందన అందుకుంది. ఇప్పుడు ఆగస్ట్ 30, 2025 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read:తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా..GAMA వేడుకలు

