రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం:హరీష్

11
- Advertisement -

రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం, అందుకే కేసీఆర్ పై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పది ఫలితాలను కూడా రాజకీయంగా వాడుకున్నడు… విద్యార్థుల ముందు సీఎం రోత మాటలు, దిగజారుడు తనం, కాంగ్రెస్ పథకాల అమలు పై చర్చకు సిద్ధం, కాంగ్రెస్ పదేళ్లు అధికారం అనేది పగటి కలే అన్నారు.

ముందు.. ఉన్న కుర్చీ లాగకుండా చూసుకో రేవంత్ అని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నడు… సమ సమాజ స్థాపన కోసం, జాతి, కుల, మత, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అన్నారు. ఆ మహనీయుడి స్పూర్తిని ప్రజలకు చాటాలని, వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని నాడు కేసీఆర్ నిర్ణయించారు.. నేడు రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడిండు అన్నారు.

పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నడు..పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేసిండు.. ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నరు అన్నారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగ మాట్లాడిండు ముఖ్యమంత్రి స్థాయిని, హోదాను దిగజార్చిండు..అచ్చోసిన ఆంబోతు అంటడు, సమాధి అంటడు కనీసం సోయి లేకుండా మాట్లాడిండు, ఇదేనా విద్యార్థులకు నువ్వు చెప్పేది రేవంత్ రెడ్డి, నువ్వా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేది..రవీంద్ర భారతిలో రాజకీయాలు మాట్లాడి దాని గౌరవాన్ని తగ్గించినవు అన్నారు.

విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదు కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నడు కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక ఈరోజు బయట కక్కిండు..కేసీఆర్ గురించి అవే చిల్లర మాటలు మాట్లాడి, కుక్క తోక వంకరే అని మరోసారి రుజువు చేసిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అన్నట్లు కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణకు విలనే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్ కు కల్పించిండు కేసీఆర్, కేంద్రం మెడలు వంచి సాధించిండు కేసీఆర్, అది ఇచ్చినోళ్ల గొప్పతనమా, సాధించినోళ్ల గొప్పతనమా?, ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని నువ్వే అంటున్నావు, మరోవైపు ప్రజలకు కష్టాలు లేవు, మాది ప్రజా పాలన అంటున్నావు రేవంత్ కు జపాన్ వెళ్లి వచ్చి మైండ్ పాడైనట్లుంది లేకుంటే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయినట్లుంది, సిగ్గులేకుండా ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి అంటున్నడు కేసీఆర్ కిట్టు ఆగిపోలేదా, దళిత బంధు ఆగిపోలేదా, బీసీ బంధు ఆగిపోలేదా, గొర్రెల పంపిణీ ఆగిపోలేదా, రెండు నెలల పింఛన్లు ఆగలేదా, డబుల్ బెడ్ రూం ఇళ్లులు ఆగలేదా, స్కాలర్ షిప్స్ ఆగలేదా, ఫీజు రీయింబర్స్ మెంట్ ఆగలేదా చెప్పాలన్నారు.

మీ 15 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా? విద్యార్థులను ముందు పెట్టుకొని, ఇచ్చిన మాట మీద నిలబడుతా అని గొప్పలు చెప్పి సప్పట్లు కొట్టించుకుంటున్నవు..నీ ఆరు గ్యారెంటీలు ఏమైనయి, నీ 420 హామీలు ఏమైనయి,ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏమైనయి జాబ్ క్యాలెండర్ ఏమైంది,
విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ఏమైంది,విద్యార్థినులకు స్కూటీ ఏమైంది,మహిళలకు 2500 ఏమైంది,తులం బంగారం ఏమైంది,కౌలు రైతులకు భరోసా ఏమైంది,
15వేల రైతు భరోసా ఏమైంది,ఇంకా సిగ్గు లేకుండా మాట తప్పను, శత్రువులు కూడా నన్ను ఏమనరు అంటడు,ఒక్కసారి నీ మేనిఫెస్టో చూసుకో @revanth_anumula నీ మాట తప్పుడు ఏందో నీకే అర్థమైతది నీ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు అన్నట్లు కాళేశ్వరం మీద చర్చ పెడుదామా? రుణమాఫీ మీద పెడుదామా? రైతు బంధు మీద పెడుదామా? నీ బోగస్ 60వేల ఉద్యోగాల మీద పెడుదామా, కులగణన మీద పెడుదామా?
దేని మీదైనా చర్చకు సిద్దం, ప్లేస్, టైం నువ్వే చెప్పు.రుణమాఫీ మీద చర్చ అని ఇప్పటికే తోకముడిచినవు ఇప్పుడు కూడా అలా చేసి తప్పించుకోకు పదేళ్లు అధికారంలో ఉంటా అని పగటి కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ఉన్న మూడేళ్లు నీ కుర్చి సక్కగ ఉండేలా చూసుకో ఏ పక్క నుంచి ఎవరు వచ్చి లాక్కుంటరో చూసుకో నువ్వు ఎంత మేకపోతు గాంభీర్యం చూపినా, కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అన్నది రోజుకోసారి నిరూపితమవుతున్నది.ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం అని అనుకోని ప్రజానీకం ఉందా అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదు అతి తక్కువ కాలంలో అన్ని వర్గాల ప్రజలతో తిట్లు తింటున్న ఏకైక సీఎం రేవంతే..శిశుపాలుడి లెక్క తప్పు మీద తప్పు చేస్తున్న నీ వైఖరిని ప్రజలు అందరూ గమనిస్తున్నారు..తగిన సమయంలో బుద్ధి చెబుతారు.నీ పేరును కేసీఆర్ గారు పలకాలని ఎన్నో రోజుల నుంచి అడుక్కుంటున్నవు కుసంస్కారం, కుంచిత స్వభావం ఉన్న నీలాంటి వారి పేరును కేసీఆర్ గారు తీయవలిసిన అవసరం ఏమిటి? అన్నారు.

- Advertisement -