అక్రమ అరెస్ట్‌లే మార్పా?: హరీశ్‌ రావు

1
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి మార్పు మార్పు అన్నడు…ఏం మార్పు తెచ్చిండు నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్.. అశోక్ నగర్ లో నిరుద్యోగుల వీపులు పగులగొట్టిండు.. గిరిజనులపై నిర్బంధం ప్రయోగించిండు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తనని ఎమర్జెన్సీ పాలన తెచ్చిండు… పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదని గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇవాళ కేసులు, ఎఫ్ఐఆర్ లు పోలీస్టేషన్లలో తయారవుత లేవు, గాంధీభవన్లో తయారవుతున్నయి అన్నారు.

ఎవరిని అరెస్టు చేయాలో గాంధీభవన్ లోనే నిర్ణయిస్తున్నరు… రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తున్నడు…పగ, ప్రతీకారంతో శాడిస్టిక్ ప్రెషర్ తో పనిచేస్తున్నడు అన్నారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నడు… ఏడాది పాలనలో ఫ్లై ఓవర్, ఎస్టీపీ, కాళోజీ కళాక్షేత్రం ఇలా ఏదైనా కేసీఆర్ పాలనలో కట్టిందేనన్నారు. వాటినే నువ్వు ప్రారంభిస్తున్నవు తప్ప, నీ ఏడాది పాలనలో ఒక భవనం కట్టినవా? , రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుందన్నారు. ఏడో గ్యారంటీ అమలు కాలేదు, అక్రమ అరెస్టులు తప్ప మరే గ్యారంటీ అమలవుతలేదు అన్నారు.

దేశ ప్రతిపక్ష నాయకుడిని, నన్నెందుకు అరెస్టు చేస్తరు అని రాహుల్ గాంధీ అడుగుతున్నడు… మరి తెలంగాణలో కూడా మీ సీఎం రేవంత్ అదే చేస్తున్నడు కదా… ముందు మీ ముఖ్యమంత్రిని బాగు చేయ్, లేదంటే మార్చెయ్ అన్నారు. లగచర్లకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు మధుసూధనారి , పీఓడబ్లూ సంధ్య తదితరులు పోతే నీ ప్రభుత్వం ఏం చేసింది?.. వారిపట్ల దారుణంగా ప్రవర్తించి, అవమానించింది కదా? అన్నారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కూడా ఇస్తలేడు… రేవంత్ రెడ్డి ఎంతకూ డబ్బులు సంపాదించాలె, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలె అనుకుంటున్నడు తప్ప పాలన లేదు అన్నారు. ఏడాది పాలనలో మహిళలకు లక్ష కోట్ల రుణమన్నవు, అదంతా బోగస్… మహిళలకు మహాలక్షి పింఛన్ ఇస్తనన్నవు.. అదీ బోగస్ అన్నారు. ఇవాళ నువ్వు మమ్మల్ని సలహాలివ్వాలని అడుగుతున్నవు…మేం చాలా సలహాలిస్తున్నము, కానీ నువ్వు పాటిస్త లేవు కదా అని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు… వీళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం… పోలీసు అధికారులు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలని కోరుతున్నాం అన్నారు. కౌశిక్ రెడ్డిని విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ నిద్రపోదు, ఆయనకు అండగా ఉంటదని.. ఈ రోజు ఉదయం నుంచీ సాయంత్రం దాకా 12 గంటలు కష్టపడి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసిన జర్నలిస్టులకు, పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు హరీశ్‌ రావు.

Also Read:బీఆర్ఎస్ పాలన..తెలంగాణ ప్రగతికి బాటలు

- Advertisement -