Harishrao:పేదల సంక్షేమమే లక్ష్యం

37
- Advertisement -

పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని ఆశా కార్యకర్తలకు సూచించారు మంత్రి హరీష్ రావు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు నియమితులైన 1560 మంది ఆశా కార్యకర్తలకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ రావు…వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా భావిస్తారన్నారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేద్దాం అన్నారు. పిల్లల కు 100% వ్యాక్సిన్ వేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లు సాధించాం..వైద్య ఆరోగ్యంలో 14 వ స్థానం నుంచి రాష్ట్రం ఏర్పడిన తరువాత 3వ స్థానంలోకి వచ్చాం అన్నారు. తెలంగాణ కు ముందు ప్రైవేట్ లో 70%, 30% ప్రభుత్వ ఆసుపత్రులో డెలివరీలు…ఇప్పుడు ప్రభుత్వంలో 70% డెలివారీలు జరుగుతున్నాయన్నారు.

న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భంతో ఉన్న మహిళలకు బలవర్ధక ఆహారం అందిస్తోన్నామని…మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ అన్నారు.కుల మతాల చిచ్చు పెట్టె పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నారని…ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఆశాలు చెప్పాలన్నారు. టి డియాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత చికిత్సలు చేస్తున్నామన్నారు.

ఒక్కో ఆశ వర్కర్ పై 50వేలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి… ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చి దిద్దుతాం అన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న 27వేల మంది ఆశలకు శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దేశంలో అత్యధిక వేతనం ఆషాలకు తెలంగాణలోనే ఇస్తున్నాం అన్నారు. నాలుకకు నరం లేదని ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు….ఆశాలకి గతంలో వేతనం.పెంచమని ఆడిగితే గుర్రాలతో తొక్కించారన్నారు.అర్ధరాత్రి ఆశా వర్కర్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…ధోని

4500 జీతం మాత్రమే ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్ లో ఆశాలకు వేతనం ఇస్తున్నారు… కాంగ్రెస్, తెలుగు దేశం బస్తి ప్రజల సుస్థి గురించి ఆలోచించలేదన్నారు.బస్తి దవాఖాన సూపర్ హిట్ అయిందని…బస్తి దవాఖాన ల వల్ల ఉస్మానియాలో 60% ఒపి భారం తగ్గిందన్నారు. గాంధీకి హాస్పిటల్ లో 56% ఒపి తగ్గింది, ఫీవర్ ఆసుపత్రిలో 72% ఒపి భారం తగ్గిందన్నారు.

గర్భిణుల కోసం 3 కొత్త ఆసుపత్రులు ఏర్పాటుచేస్తున్నామని…గాంధీ లో ఒక వారంలో సూపర్ స్పెషలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభిస్తాం అన్నారు.రాష్ట్రంలో మాత మరణాలను 42 కి తగ్గించామని చెప్పారు. నిమ్స్ లో రోబోటిక్ యంత్రం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్లు కృషి అభినందనీయమన్నారు.

Also Read:తెలంగాణ పథకాలు కాపీ కొట్టడానికే రాష్ట్రానికి మోడీ..

- Advertisement -