కరోనా కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితం అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రపంచ మేడే దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట కొండ మల్లయ్య గార్డెన్ లో సిద్దిపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సన్మానం కార్యక్రమంలో పాల్గొని , వారి తో కల్సి సహా పంక్తి అల్పాహారం చేసిన మంత్రి హరీష్ రావు. శేషాద్రి ఆస్పత్రి వారి సహకారంతో ఫ్లాస్కు లు, NRI ల సహకారంతో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కరోనా కాలంలో వైద్యులు, పోలీసులు ఎంత కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు.ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులకు హక్కులు లభించాయన్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. ఎవరూ వపట్టించుకొని బీడీ కార్మికులకు రెండు వేల భృతి అందిస్తూ ధైర్యాన్ని అందించిందన్నారు.
కరోనా కాలంలో ఎంతో మంది వలస కార్మికులను అడుకుంటున్నాం… యాజమాన్యం ఎంత ముఖ్యమో కార్మికులు అంటే ముఖ్యం.కార్మికులు లేకుంటే ఉత్పత్తి లేదు.. అభివృద్ధి లేదన్నారు. కార్మికులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానిదన్నారు.