మరో రీమేక్ మూవీతో హరీష్ శంకర్!

48
Harish shankar
- Advertisement -

దర్శకుడు హరీష్‌ శంకర్ మరో రీమేక్ మూవీతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు హరీష్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండడంతో మరో బాలీవుడ్ మూవీ రీమేక్‌పై కన్నేశాడు హరీష్.

2018లో అజయ్ దేవగన్, ఇలియానా మెయిన్ లీడ్ లో వచ్చిన చిత్రం రైడ్. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న హరీష్..ఇందుకోసం ముంబై వెళ్ళి రైడ్ ప్రొడ్యూసర్ మంగత్ పాఠక్‌ను కలిసి తెలుగు రీమేక్ రైట్స్ పై సంప్రదించినట్టుగా సమాచారం.

అయితే ఈ సినిమాను తెలుగులో ఎవరితో చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. గతంలో పవన్‌తో దబాంగ్ మూవీ కథలో కొంత మార్పులు చేసి గబ్బర్‌సింగ్‌గా తెరకెక్కించగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి హరీష్ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -