ప్చ్… ఆలు – చూలు లేకుండానే సోమలింగం !

119
pawan
- Advertisement -

‘ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం’ అన్నాడట వెనకటికి ఒకడు. అలా ఉంది దర్శకుడు హరీష్ శంకర్ వ్యవహారం. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటూ తనకు తానే ఒక చిన్న గాసిప్ వదిలాడు. ఆ గాసిప్ కాస్త వైరల్ అయ్యి.. చివరకు సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యే వరకు వెళ్ళింది. కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కి డేట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఈ లోపు మైత్రీ వాళ్ళు కూడా సినిమా ఉంది అంటూ ఎనౌన్స్ చేశారు. సరే ఇలా అప్ డేట్ వదిలితే వదిలారు, దాన్ని కంటిన్యూ చేస్తూ.. పవన్ – హరీష్ కలయికలో చేస్తున్న సినిమాకి సంబంధించిన అప్ డేట్లు ఇవ్వండి అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టారు.

హరీష్ శంకర్ కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన మెసేజ్ లు అన్నిటికీ ఆన్సర్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సినిమా అలా ఉండబోతుంది ?, ఇలా ఉంటుంది అంటూ కబుర్లు చెప్పాడు. చివరకు ఆ కబుర్లు మాత్రమే మిగిలాయి. ఈ సినిమాకి సంబంధించి ఏ అధికారిక అప్ డేట్ లేకుండా పోయింది. ఈ లోప్ ఈ సినిమాకి సంబంధించి అనేక పుకార్లు పుట్టించారు

పైగా ఈ సినిమాకి ఒక నేపథ్యాన్ని కూడా అల్లేశారు. దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ కోసం 1980 కాలపు పొలిటికల్ డ్రామా కథ రాసుకున్నాడు అని, ఇక చివరగా ఈ చిత్ర లాంఛింగ్ సమయాన్ని కూడా త్వరలో వెల్లడిస్తారని ఇలా సాగాయి పుకార్లు. చివరకు ఈ సినిమా ఆగిపోయింది అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇన్నాళ్లు ‘ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం’ అంటూ నమ్మబలికిన హరీష్ శంకర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడు ?.

ఇవి కూడా చదవండి..

- Advertisement -