తులసితో ప్రయోజనాలు

134
tulsi
- Advertisement -

1. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతు గరగర నుంచి ఉపశమనం పోందవచ్చు.

3. చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే ఉపశమనం లభిస్తుంది.

4. రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.

5. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం లభిస్తుంది.

6. రోజుకు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది.తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.

7. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నవారు తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే ఫలితం లభిస్తుంది.

- Advertisement -