మీరు కారణజన్ములు.. సీఎం కేసీఆర్‌కు హరీష్‌ రావు బర్త్‌ డే విషెస్‌..

119
- Advertisement -

ఈరోజు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీష్‌ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ మంత్రి హరీష్‌ రావు ట్వీట్ చేశారు.

- Advertisement -