కాళేశ్వరంతో గ్రామాలు సస్యశ్యామలం: హరీష్

318
harishrao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా రంగనాయక సాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు రానున్నాయని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో ప్రధాన కుడి కాలువతో సిద్ధిపేట అర్బన్, రూరల్, నంగునూరు మండలాల్లోని గ్రామాలలో కాల్వల ద్వారా నిండనున్న గ్రామీణ ప్రాంత చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ లు, కాల్వలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

రంగనాయక సాగర్ ప్రధాన కుడి కాలువ వెంట గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలను కాల్వల ద్వారా నింపేందుకు అనువైన స్థలాల భూ సేకరణకు కావాల్సిన ప్రాంతాల స్థితిగతులపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు.

పుష్కలమైన నీటి వనరులతో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని, నంగునూరు మండలంలోని గ్రామాలు, సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, నర్సాపూర్, లింగారెడ్డిపల్లి గ్రామ రైతులకు వ్యవసాయ పొలాల వద్ద తూములు కట్టించుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.

కాల్వలతో చెరువులు, కుంటలు నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -