నాడు ఉద్యమానికి ఊపిరిగా నేడు బంగారు తెలంగాణ బాటలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(టీఆర్ఎస్‌వీ) ముందు వరుసలో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో టీఆర్ఎస్‌వీ జిల్లా స్ధాయి శిక్షణ తరగతుల్లో మాట్లాడిన హరీష్ ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణలో ప్రాజెక్టులు అడ్డుకోవడానికి టీడీపీ అహర్నిశలు శ్రమిస్తోందని…ఏపీకి ప్రత్యేక హోదా తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోవా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని కుట్రలు లేవని…తెలంగాణ ఏర్పాటు అనైతికమని ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో కాంగ్రెస్ అధికారం కోసం పొత్తుపెట్టుకుంటుందోని మండిపడ్డారు హరీష్. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీతో కలిసిన కాంగ్రెస్,తెలంగాణకు రావాల్సిన పారిశ్రామిక ఇన్సెంటివ్ గురించి ఎందుకు అడగటం లేదన్నారు.తెలంగాణకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావాలంటే.. అది కేవలం సీఎం కేసీఆర్ తోటే సాధ్యం అవుతుందన్నారు.