రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.డిసెంబర్ 31 దావత్‌లను బంద్ చేసి.. ఆ డబ్బుతో హాస్టళ్లను దత్తత తీసుకోవాలని రాష్ట్రంలోని యూత్, యువజన సంఘాలకు పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా నాసరపుర కేంద్రంలోని అర్బన్ రెసిడెన్సియల్ బ్రిడ్జి స్కూల్‌లోని విద్యార్థులకు స్వెట్లర్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్..జీతం అగొచ్చు కానీ మెస్ బిల్లులు మాత్రం ఆగవు అన్న సీఎం మాట ఏమైందని నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని విమర్శించారు.
మహాలక్ష్మి, తులం బంగారం ఎటు పోయాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా లేక ముఖ్యమంత్రి ఉత్త మాటలు చెప్పానని అధికారులకు చెబుతున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయంలో కూడా మాట నిలుపుకోలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఏ విషయంలోనూ చెప్పిన మాటకు క్షేత్రస్థాయిలో పొంతన లేదని అన్నారు.
Also Read:కూల్చివేతలు ఆగవు..త్వరలో గ్రీవెన్ సెల్: రంగనాథ్