ఈచ్ వన్…టీచ్ వన్ :హరీష్ రావు

452
harish rao
- Advertisement -

ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..డైరీ అంటేనే తెలంగాణ ఉద్యమ వేదికలు,జనవరి నెల మొత్తం కూడా డైరీ లు ఆవిష్కరణ చేసేవాళ్ళం అన్నారు. ఉద్యమ సమయంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసేవాళ్ళం అని 12 సంవత్సరాల క్రితం ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారని చెప్పారు.

తెలంగాణ లో ప్రైవేట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఈ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం చేశాం అన్నారు. ప్రైవేట్ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగుల హక్కులు కాపాడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ తో కూడా ఈ విషయంలో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తాను..ప్రైవేట్ మహిళ ఉద్యోగులకు మెటర్నిటీ లివ్ ల విషయంలో కూడా మాట్లాడుతానని చెప్పారు.

మంచి ఉద్యోగం వస్తేనే ఉద్యోగం చేస్తా అనడం మంచిది కాదు పనిని బట్టి ఉద్యోగం చేస్తాం అంటే ఎలా పెరు పెద్దగా ఉండి జీతం తక్కువ ఉంటే ఎం లాభం యువత ముందుకు పోవాలి,ప్రభుత్వ తరుపున కూడా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో కూడా బీహార్ నుండి ఇక్కడకు వచ్చి పని చేసుకున్నారు కానీ మన వారు మాత్రం ఎక్కడ చెయ్యలేదు..ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారే మన దగ్గర పని చేస్తున్నారని చెప్పారు. మనవాళ్లకు మనం కూడా ట్రైన్ చేసి పని కల్పించాలి..చాలా మంది ఐఏఎస్ ల కొడుకులు, కూతుర్లు ప్రైవేట్ ఉద్యోగాలే ఎక్కువ చేస్తారని చెప్పారు.

ఈచ్ వన్ టీచ్ వన్‌ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలి…100 శాతం అక్షరాస్యత మనకు పెద్ద విషయం కాదు మీరు ఒక్క సైనికులు గా ముందుకు తీసుకొనిపోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన మనకు ఇది పెద్ద లెక్క కాదు ప్రైవేట్ ఉద్యోగులకు డబల్ బేడ్ రూమ్ లు అడిగారు అయితే ఇప్పటికే అనేక చోట్ల డబల్ బెడ్ రూమ్ లు నిర్మాణం చేశాం…హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు అందుబాటులోకి వచ్చాయి..ప్రైవేట్ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్,వంటేరు ప్రతాప్ రెడ్డి,ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -