రాష్ట్రాలను విమర్శించడం రాజనీతా: నడ్డాకు హరీష్‌ ప్రశ్న

285
harish rao
- Advertisement -

మానవాళి మనుగడకే సవాల్‌గా మారిన కరోనా విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సూచించారు మంత్రి హరీశ్‌ రావు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనా పై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని తెలిపారు హరీశ్.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతుంది ఇదే కదా అని నడ్డాకు గుర్తు చేసిన హరీశ్…దేశ రక్షణ విషంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు. సైనికుల నైతిక స్థైర్యం దెబ్బ తీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? అని ప్రశ్నించారు.

దేశానికి వైద్య శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న మీరే వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపడం సబబా? ఇది వైద్య సిబ్బంది ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే చర్య కాదా? మీకు మరో సారి విజ్ఞప్తి చేస్తున్నా.. మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోన విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం అన్నారు.

- Advertisement -