కొమురవెళ్లి మల్లన్న కల్యాణంలో మంత్రి హరీష్‌..

238
Minister Harish
- Advertisement -

సిద్ధిపేట జిల్లా శ్రీ కొమురవెళ్లి మల్లికార్జున స్వామికి పట్టు బట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు. ఆదివారం మల్లికార్జున స్వామి కల్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తజనం హాజరైయ్యారు. కల్యాణ మండపంలో ఉత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికీ మాస్కులు అందజేసి కోవిడ్ నిబంధనల మధ్య పకడ్బందీగా చర్యలు చేపట్టారు ఆలయ నిర్వాహకులు.

ఉత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో దేవాలయాలు దూపదీప నైవేద్యలతో మహర్దశను సంతరించుకున్నాయన్నారు. గత సంవత్సరం మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రాజెక్టులన్ని పూర్తికావాలని మొక్కుకున్న.. మల్లన్న దయవల్ల ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తయయ్యాయి. ఉత్తరన రంగనాయక సాగర్, దక్షిణన కొండపోచమ్మ సాగర్, మధ్యలో మల్లన్న దేవాలయనికి గోదావరి జలాలు చేరుకున్నాయి. వచ్చే సంవత్సరంలో మల్లన్న సాగర్ పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసుకుందామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మించిన ప్రతి ప్రాజెక్ట్‌కు దేవుళ్ళ పేర్లు పెట్టి వారి ఆశీర్వాదంతో త్వరతగతిన పూర్తి చేసుకున్నాం. మల్లన్న కళ్యాణంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు కల్యాణం నిర్వహించడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

- Advertisement -