రన్ ఫర్ స్వచ్ఛ సిద్ధిపేట- మంత్రి హరీశ్

163
- Advertisement -

సిద్దిపేటలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్.. స్వచ్ఛ రన్‌లో భాగంగా 2కే రన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ సర్కిల్‌ నుంచి ముస్తాబాద్‌ చౌరస్తా వరకు ఈ రన్‌ కొనసాగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్‌లో జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డిలు పాల్గొన్నారు. స్వచ్ఛ సిద్దిపేట పట్టణం కోసం 2కే రన్‌ను నిర్వహిస్తున్నామని.. స్వచ్ఛరన్‌లో పాల్గొని దేశానికి మన ఐక్యతను చాటి చెబుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛ రన్ లో పాల్గొందాం. దేశానికి మన ఐక్యతను చాటి చెబుదామని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. దేశంలోని నగరాల సరసన స్వచ్ఛ సర్వేక్షణ్ లో పాల్గొని సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి వరుసలో నిలుపుదామని ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. రన్ ఫర్ స్వచ్ సిద్దిపేట కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. పట్టణ యువత స్ఫూర్తి. సిటీజన్స్ చైతన్యం బాగుందన్నారు. మన సిద్దిపేట మన బాధ్యతగా పట్టణ ప్రతి పౌరుడు పట్టణ స్వచ్ఛతకై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. స్వచ్ఛ సిద్ధిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఇవాళ 2కే రన్ కార్యక్రమంలో స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు. ఇదే స్ఫూర్తి భారతాన అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని మంత్రి కోరారు.

సిద్దిపేట అంటే శుద్దిపేటగా మనం ప్రతి రోజు మూడు రకాల చెత్తను వేర్వేరు చేస్తూ భాగస్వామ్యమవుతున్నాం. అందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ ను మరింత స్కోర్ పెంచి దేశంలో ప్రథమ స్థానంలో నిలపాలి. సిద్ధిపేట ఉత్తమ పట్టణంగా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రాత్రి సిద్ధిపేట స్టేడియంలో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించుకొనున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో నెంబరు వన్ గా ఉండాలని, ఇందు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. ప్లాస్టిక్ రహిత సిద్ధిపేటగా తీర్చిదిద్దేలా ప్లాస్టిక్ కంటే తక్కువ ధరలో ప్రతి మున్సిపల్ వార్డులో స్టీల్ బ్యాంకులు పెట్టి ఆదర్శ సిద్ధిపేటగా మార్చుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఏబీసీ- ఆనిమాల్ బర్త్ కంట్రోల్ యూనిట్, కుక్కల సంతతి తక్కువగా అయ్యేలా వెటర్నరీ వైద్యుల సహకారంతో ఫ్యామిలీ కంట్రోల్ యూనిట్ ను సిద్ధిపేటలో వచ్చే ప్రారంభించుకొనున్నాం. మన ఇంటితో పాటు గల్లీ, పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నదే నా తాపాత్రయం. ఇందు కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మెదలాలి. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిద్ధిపేట పట్టణం పరిశుభ్రమైన పట్టణం సాధ్యమని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. నేను సైతం నా సిద్ధిపేట పట్టణం కోసం, స్వచ్ఛ సర్వేక్షణ్-2021 కార్యక్రమ సన్నాహకంగా సిద్దిపేటలో నిర్వహించిన 2కే రన్ నిర్వహించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు స్వచ్ఛ 2కే రన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన పోలీసు శిక్షణ పొందుతున్న జీ.సాయికృష్ణ, జీ.కిషోర్, డి. శ్రీకాంత్, ఫుట్ బాల్ క్రీడాకారులు ఈశ్వర్, చైతన్య, రమ్య, మౌనిక, కృతిక తదితరులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఒక్క అడుగు పరిశుభ్రతవైపు వేద్దాం..స్వచ్ఛ సిద్ధిపేటగా మారుద్దాం.

ఈ 2కే రన్ లో భాగంగా మహాత్మాగాంధీ కలలు గన్న పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన దేశం కావాలని సంకల్పించారు. దీన్ని స్ఫూర్తితో స్వచ్ఛ తెలంగాణ సాధించి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సిద్ధిపేట సాధించే లక్ష్యంతో కృషి చేస్తానని బోర్డుపై సంతకంతో కూడిన ప్రతిజ్ఞకు మంత్రి హరీశ్ రావు మొదటి సంతకం చేశారు. అనంతరం ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, పట్టణ వాసులు, పట్టణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛ సిద్దిపేటకై సంతకం చేసి ఫోన్ నంబర్ వేసి ప్రమాణం చేశారు.

- Advertisement -