తెలంగాణలో ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన బీఆర్ఎస్ను ఓడించలేరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయం వెడెక్కుతున్న నేపథ్యంలో హరీశ్‌రావు మాటలు ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నదని తెలిపారు. అందుకే భయపడి ప్రతిపక్షాలు ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. నడ్డా మాటలతో తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ కూడా ఈ సారి కనీసం డిపాజిట్లు కూడా రావని తెలిపారు. దేశంలో గుణత్మాకమైన మార్పు కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. మా పార్టీ నుంచి ఎవరూ కూడా బయటకు వెళ్లడం లేదని తేల్చి చెప్పిన హరీశ్ బహిష్కృత నేతలు వేరే పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అంతేకానీ మా పార్టీ నుంచి ఎవరూ కూడా వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
Also Read: స్ట్రాటజీ మీటింగ్.. టి కాంగ్రెస్ లో కల్లోలం ?