పేరుకే ఎయిమ్స్‌….అంతా డొల్లా :మంత్రి హరీశ్‌రావు

113
- Advertisement -

మెడిక‌ల్ కాలేజీల విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా రాష్ట్రానికి మంజూరు చేయ‌కుండా, తామే ఇచ్చామ‌ని కిష‌న్ రెడ్డి మాట్లాడ‌టం దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. పేరుకే ఎయిమ్స్ ఇచ్చారు.. అక్కడ ఆపరేషన్ థియేట‌ర్ లేదు.. ఆక్సిజ‌న్, బ్ల‌డ్ బ్యాంక్ లేదని ధ్వ‌జ‌మెత్తారు.

మీరు మెడికల్ కాలేజీ ఇస్తే ఎక్కడ ఇచ్చారో చెప్పండి. కాగితాలు చూపించండ‌ని స‌వాల్ విసిరారు. ఎయిమ్స్ వైద్య విద్యార్థులు తమ విద్య ఆగం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటే వారు భువనగిరి ఆస్ప‌త్రిలో ప్రాక్టికల్స్ చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం దిక్కుమాలిన రాజకీయం. కిషన్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నాన‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా… ఇస్తే అది చెప్పాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క కాలేజీ మంజూరు చేయలేద‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వకపోయిన, సొంత డబ్బులతోనే జిల్లాకో కాలేజీ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నరు. ఇవాళ మెడికల్ సీట్లు, మెడికల్ కాలేజీలు పెరిగాయంటే అందుకు కారణం బడ్జెట్లో వైద్య రంగానికి సీఎం ఎక్కువ నిధులు కేటాయించడం వల్లే సాధ్యమైంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

- Advertisement -