“ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ హై”.. మనసు దోచుకున్న మంత్రి హరీష్..

38

“అబ్దుల్ బాయ్.. ” క్యా భాయ్ ఖైసేహో… ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ రహేత బొల్కే సునా..” మీ దగ్గర చాయ్ త్రాగుదాం అని.. కాసేపు సేద తీరి చాయ్ త్రాగి సిటీ ప్యాలెస్ మనసు దోచుకున్నారు మంత్రి హరీష్ రావు. హుజురాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా చాయ్ త్రాగాలి అనిపించి..కాసేపు సేద తిరాలి అని హుజురాబాద్ సిటీ ప్యాలెస్ వద్ద కారు ఆపి సిటీ ప్యాలెస్‌కి వెళ్లి మంత్రి హరీష్ రావు చాయ్ త్రాగారు..

ఈ సందర్భంగా గిరాకీ ఎలా అవుతోంది.. ఎన్నికల వేళ బాగుందా అని ప్యాలెస్ యాజమానితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు మంత్రి.. బాగుంది సర్.. అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు షాపు యజమాని.. మీ దగ్గర చాయ్ బాగుంటుందట అందుకే ఆగాను…!! ” ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ హై “.. అంటూ వారి మనసు దోచుకున్నారు.. సార్ ఎన్నో రోజుల నుండి అనుకుంటున్న.. మీరూ మా హోటల్‌లో చాయ్ త్రాగాలి అని… ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్.. !! మీతో ఒక సెల్ఫీ దిగాలి అని కోరిక. సర్ అంటూ సెల్ఫీ దిగారు.. ప్యాలెస్ ప్రాంతం అంత సెల్ఫీ లతో.. సందడిగా మారింది.. మరో సారి వస్తా అంటూ..చాయ్ డబ్బులు చెల్లించారు మంత్రి హరీష్ రావు.