సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌

62
harish

సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గంలోని 12 మంది లబ్ధిదారులకు రూ.5,16,500 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఒక వరమని అన్నారు. గురువారం లబ్ధిదారులు వెంటనే బ్యాంకు జమ చేసుకోవాలన్నారు.

పట్టణానికి చెందిన నలుగురికి రూ.1,85,500, సిద్దిపేట రూరల్‌ మండలంలో ఇద్దరికి రూ.97,500, సిద్దిపేట అర్బన్‌ మండలంలో ముగ్గురికి రూ.1,31,000, చిన్నకోడూరు మండలంలో ఇద్దరికి రూ.55,500, నారాయణరావుపేట మండలంలో ఒక్కరికి రూ.47,500 మంజూరైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.