డయాలసిస్‌ పేషెంట్లకు పెన్షన్లు పంపిణీ చేసిన:హరీశ్‌రావు

129
- Advertisement -

భారతదేశంలో డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డయాలసిస్‌ పేషెంట్లకు ఆసరా పింఛన్ల అందించడం కేవలం సీఎం కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో నిర్వహించిన డయాలసిస్‌ పెషెంట్లకు ఆసరా పింఛన్లు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది డయాలసిస్ పెషేంట్లకు పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు 700కోట్లు కిడ్నీ రోగుల కోసం ఖర్చు చేశామన్నారు. వారికి ఇవాళ గుర్తింపు కార్డులు అందిస్తున్నట్లు పేర్కొంది. 10వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని, అందులో 5వేల మందికి రూ.2016 చొప్పున ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ డయాలసిస్‌ పేషెంట్లకు ఆసరా పెన్షన్ అందించడం సంతోషకరమన్న హరీశ్‌రావు.. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

కిడ్నీ రోగుల కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.100 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, డయాలసిస్‌ రోగులకు సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్‌ తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణలో 103 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షలు ఇచ్చి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేస్తుందని, అలాగే వారికి జీవితకాలం ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతోందన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ కేంద్రాలను గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లలో పనిచేస్తున్నట్టు తెలిపారు. రూ.40 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతుంది. ప్రతి 100 మందిలో 20మందికి షుగర్, బీపీ వ్యాధులు వస్తున్నాయన్న మంత్రి.. చిన్న వయసులో సైతం కనిపిస్తున్నాయన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు.

- Advertisement -