హరీష్ రావు మెజార్టీ @ లక్ష

379
harish rao
- Advertisement -

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రికార్డు సృష్టించారు. సిద్దిపేట నుండి డబుల్ హ్యాట్రిక్‌ కొట్టిన హరీష్ అతి పిన్న వయసులో ఆరోసారి గెలిచిన ఎమ్మెల్యేగా చరిత్రసృష్టించారు. కౌంటింగ్ ప్రారంభం నుండి స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయారు. సమీప ప్రత్యర్థి నాయిని నరోత్తమ్‌రెడ్డిపై లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. గత ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు.ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీశ్‌. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తామంటూ సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజాసేవలో ఎప్పుడు ప్రత్యేక వైఖరిని అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతారు. తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలో కూడా ఆయన ఇతరులకంటే చాలా యాక్టివ్.అందుకే పోటీ చేసిన ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ వస్తున్న హరీశ్ తాజాగా అరుదైన రికార్డుకు చేరవయ్యారు.

సంకల్పం ఉంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి నేతలకు ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ప్రస్తుతం సిద్ధిపేట యావద్దేశానికే ఉదాహరణగా నిలుస్తోంది. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజక వర్గం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. ఈ గొప్ప మార్పుకు చరిత్రకు కారణం సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గ సభ్యుడు మంత్రి హరీష్ రావు కారణభూతులయ్యారు

- Advertisement -