సిద్దిపేట అభివృద్ధిలో తనదైన ముద్ర వేయటంలో మంత్రి హరీష్ ఎప్పుడు ముందుంటారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై అధికారులతో రివ్యూలు నిర్వహించడమే కాదు పనులు జరుగుతున్న తీరును పరిశీలించడటంలో ఆయన ప్రత్యేకతే వేరు. హరీష్ అంటేనే డెవలప్ మెంట్‌గా పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణించి సిద్దిపేట అభివృద్ధిని స్వయంగా తెలుసుకున్నారు.
మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుతో పాటు అధికారులతో ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణించి పనుల వివరాలపై ఆరా తీశారు. సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మెదక్ రోడ్డు విస్తరణ,ఫుట్ పాత్ పనుల జరుగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ రోడ్డు పనుల నిర్మాణంలో అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కోమటిచెరువు అభివృద్ధి పునులను పరిశీలించి… అధికారులతో రివ్యూ నిర్వహించిన హరీష్…అనుకున్న సమయంలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాసేవలో ఎప్పుడు ప్రత్యేక వైఖరిని అవలంబించే హరీష్…ఏ సమస్యనైనా పరిష్కరించడంలో ధిట్టా. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ సిద్దిపేట అభివృద్ధిపై అహర్నిషలు శ్రమిస్తున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన సిద్ధిపేట ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది.
ఇటీవలె తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. బుల్లెట్‌పై తిరుగుతూ… కాలువ పనులు ఎక్కడి వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల నుంచి వెళుతున్న కెనాల్‌తో రైతులకు కలిగే లాభాలను మంత్రి వివరించారు.