ఏపీ డీజీపీగా హరీశ్‌ గుప్తా

21
- Advertisement -

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు హరీశ్ గుప్తాను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ డీజీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డిను ఆదివారం ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

హరీశ్‌ గుప్తా నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది ఈసీ. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది.
1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి హరీశ్.

కొత్త డీజీపీని నియమించేందుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఏపీ సర్కారు పంపగా ఇందులో ఆర్టీసీ ఎండీ తిరుమలరావుతో పాటు మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లు ఉన్నాయి. ఇందులో హరీశ్‌ గుప్తాను డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది.

Also Read:బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టుకు కవిత..!

- Advertisement -