సిద్ధిపేట యువతీయువకుల కోసం ఉచిత ఆన్ లైన్ క్లాస్ ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ ను ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏ ఆప్ వెతికిన కూడా ముందు ఫ్రీ అంటారు తర్వాత 500 కట్టమంటారని విద్యార్థులు చెప్పారు. ఈ ఉద్యోగ యాప్ మేము సీరియస్ గా యూస్ చేసుకొని ఆత్మవిశ్వాసం పొందుతామని విద్యార్థులు చెప్పిన మాటలు మంచి సంతోషాన్ని కలిగించాయి. ఏ పని చేసినా దాంట్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుంది అన్నారు.
ఈ యాప్ ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు చదువుకున్నారు. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకున్ని అందించిన కాలేజ్. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అందించిన కాలేజ్ ఇది.నాక్ లో సిద్దిపేట డిగ్రీ కాలేజీకి ఏ గ్రేడ్ రావడానికి సిబ్బంది, ప్రిన్సిపల్ చాలా కృషి చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 95% జాబ్ చేస్తామని 5% మాత్రమే వ్యాపారం చేస్తామని చేతులు ఎత్తారు.. అదే గుజరాత్ లాంటి రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి 95% ముందుంటారు. ఇంటర్న్ షిప్ కి ఆదరణ పెరిగింది. ఉద్యోగం చేస్తాను కాదు ఉద్యోగం ఇస్తాను అనే ఆలోచనతో మీరందరూ ముందుకు వెళ్లాలి. సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుండాలని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ ఐటిఐ, మెడికల్ కాలేజ్ తెచ్చాను.. మెడికల్ కాలేజ్ సిద్దిపేటకు రావాలనేది ఒక కల. అలాంటి కలను మనం నెరవేర్చుకున్నాం అన్నారు.
రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు, రెండు పారామెడికల్ కాలేజీలు, బీఫార్మసీ కాలేజ్, బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్ ఇలా అన్ని విద్యాలయాలు సిద్దిపేటలో ఉన్నాయి..విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందాం. ఇంకా అభివృద్ధి చెందుతాం. అది నా బాధ్యత. సిద్దిపేటలో ఐటీ టవర్ ని కూడా తెచ్చి ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తున్నాం. సిద్దిపేట ఒక ఎడ్యుకేషనల్ హబ్. రిజర్వాయర్లకు కూడా సిద్దిపేటనే హబ్. ఆలయాలకు కూడా సిద్దిపేట నిలయం.
పెద్ద పెద్ద నగరాలకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు కానీ మన సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది.యువత గంజాయికి డ్రగ్స్ కి బానిస అవుతున్నారు.. సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్స్ కు అడిక్ట్ అవుతున్నారు. కొన్ని దేశాల్లో ఒక వయసు వచ్చేవరకు ఫోన్లు నిషేధించారు. ఈరోజు చిన్న పిల్లలు అన్నం తినాలంటే కూడా మొబైల్ ఫోన్ ఇచ్చే పరిస్థితి మన దగ్గర ఉంది. మొబైల్ కి మనం బానిస కాకుండా మొబైల్ ని సక్రమంగా యూస్ చేసుకొని మనం పైకి రావాలి.ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదివి మీరు ఉద్యోగం కొడితే మీ జీవితమే మారిపోతుంది అన్నారు.
కావాల్సిందల్లా పట్టుదల. డెడికేషన్ ఉంటే ఎంతటిదాన్నైనా సాధించవచ్చు. ఈ యాప్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది గేమ్ చేంజర్.. హైదరాబాద్ కెళ్ళి కోచింగ్ చేసే దానికంటే యాప్ ద్వారా మీరు లాభం పొందుతారు. మీ డెడికేషన్ కు మీ పట్టుదలకు స్కై ఇస్ ద లిమిట్. కొత్త ఆలోచనలతో ముందుకు రండి. మీతో పాటు నలుగురికి దారి చూపించండి. ఈ యాప్ ని మీరందరూ సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాలని గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు హరీష్.
Also Read:ఏపీ పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం

