మహారాష్ట్రలోని భీమండి నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. మేయర్ ఎన్నికల ముందు బీజేపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి మద్దతు ప్రకటించారు.
90 సభ్యుల కార్పొరేషన్‌లో మెజారిటీకి 46 స్థానాలు అవసరం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 30 సీట్లు,బీజేపీ 22, శివసేన 12, (ఎన్‌సీపీ ఎస్పీ) 12, సమాజ్‌వాదీ పార్టీ 6, కొనార్క్ వికాస్ అఘాడి 4, భివండి వికాస్ అఘాడి 3, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు.
ప్రారంభంలో కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో మేయర్ పదవిని గెలుచుకుంటామని భావించింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ శివసేనకు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు మారాయి.
ఈ సమయంలో బీజేపీకి చెందిన నారాయణ్ చౌధరి నేతృత్వంలో 9 మంది కార్పొరేటర్లు వేరు గుంపుగా ఏర్పడి కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో “సెక్యులర్ ఫ్రంట్” బలం 51కి పెరిగి మెజారిటీ మార్క్‌ను దాటింది. కూటమి నారాయణ్ చౌధరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ స్నేహా పాటిల్‌ను అధికారిక అభ్యర్థిగా నిలిపింది.
Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

