Pawan:వీరమల్లు టీజర్ వచ్చేసింది

13
- Advertisement -

క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్నారు పవన్‌. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

తాజాగా టీజర్‌తో ప్రేక్షకులను అలరించాడు పవన్. మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోడానికి ఓ దొంగ వస్తాడు, 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా కథాంశం ఉండనున్నట్టు చూపించారు. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -