హరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్ ఛేంజ్

4
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. తొలుత ఈ సినిమా రిలీజ్ డేట్ తేదీని మార్చిన అని ప్రకటించగా తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు మేకర్స్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌.. మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నిధి అగ‌ర్వాల్‌ ఇద్ద‌రూ గుర్ర‌పు స్వారీ చేస్తున్న‌ట్లుగా పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోండగా అలాగే హోళీ శుభాకాంక్షలు కూడా తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీలో బాబీ దేవోల్, నర్గీస్‌ ఫక్రీ, నోరా ఫతేహిలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

 

Also Read:ఓటీటీలో ‘లైలా’..తమిళంలో!

- Advertisement -