- Advertisement -
టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మరోసారి తన బ్యాటుకు పదునుచెప్పాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో ఏకంగా 55 బంతుల్లో 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
6 ఫోర్లు,20 సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే ఈ ఆల్‌రౌండర్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం విశేషం. పాండ్యా స్ట్రైక్‌రేట్ 287.27గా ఉండగా హార్ధిక్ రాణించడంతో రిలయన్స్ 1 టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
గత ఏడాది వెన్ను గాయం కారణంగా టీమిండియాకి దూరమైన హార్దిక్ పాండ్య.. రెండు నెలల నుంచి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సెంచరీలతో రాణించిన హార్ధిక్.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌కి ఎంపికవడం ఖాయమనిపిస్తోంది.
- Advertisement -