ఆసీస్ గడ్డపై అద్బుత ఫామ్‌తో అలరిస్తున్నాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ముఖ్యంగా టీమిండియా టీ20 సిరీస్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ నెల 17 నుండి ఆసీస్‌తో భారత్ టెస్టు మ్యాచ్ జరగనుండగా ఆసక్తికర కామెంట్స్ చేశారు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్.
హార్ధిక పాండ్యాను ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు పాండ్యా. హార్దిక్ ఉన్న మంచి ఎనర్జీతో పాటు మిగిలిన ఆటగాళ్లకు తన చేష్టలతో మంచి బూస్ట్ అందిస్తాడు. పరిమిత ఓవర్లలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చకున్న పాండ్యా టీమిండియాకు బ్యాటింగ్‌లోనూ కీలకంగా మారుతున్నాడని వార్న్ అభిప్రాపయడ్డారు.
పాండ్యా సత్తాకు ఆసీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లే నిదర్శనం. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన పాండ్యా టీ20 సిరీస్‌లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడని తెలిపాడు షేన్ వార్న్.