- Advertisement -
కెప్టెన్సీ తనపై బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు హార్థిక్ పాండ్యా. ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలిసారే కప్ గెలుచుకుంది గుజరాత్. ఈ సందర్భంగా మాట్లాడిన హార్థిక్… కెప్టెన్ కావడం తన బాధ్యతను పెంచిందని, నాయకత్వాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించానని తెలిపాడు.
ఎప్పుడు అవకాశం లభించినా మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా జట్టును ముందుండి నడిపించానని తెలిపారు. ఐపీఎల్‌లో తాను అలాగే చేశానని…కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే సాధించిన ఐపీఎల్ ట్రోఫీకి తన దృష్టిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పాడు.
టి20లు బ్యాటర్ల ఆట మాత్రమే అని చాలా మంది అనుకుంటారని, అయితే ఈ ఫార్మాట్‌లో బౌలర్లే మ్యాచ్ గెలిపించగలరని హార్దిక్ అభిప్రాయపడ్డారు. టీమిండియా సభ్యుడిగా వరల్డ్‌కప్ గెలుపులో భాగం కావడమనేదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను అని తెలిపాడు.
- Advertisement -